గచ్చిబౌలి: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతం సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టి అక్రమం అని తేలడంతో వాటిని కూల్చేశారు. అనుమతులు లేని షేడ్లు, నిర్మాణాలను కూడా కూల్చారు.