డాక్టర్ ఉమర్ నబీయే తనను తాను పేల్చివేసుకున్నాడు
సహాయకుడు, కశ్మీర్‌కు చెందిన సన్నిహితుడు అమీర్ సహకారం
అతడి పేరిటే కారు రిజిస్ట్రేషన్
ఐఇడిలు అమర్చేందుకు వీలుగా కారులో మార్పులు
ఎన్‌ఐఎ దర్యాప్తులో సంచలన విషయాలు
హర్యానాలో మరో మహిళా డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఎర్రకోట వద్ద జరిగింది పూర్తి స్థాయి ఆత్మాహుతి దాడి పేలుడు ఘటన అని జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) దర్యాప్తులో తేటతెల్లం అయిం ది. ఈ నివేదిక కీలక విషయాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట వద్ద ఓ కారు లో అమర్చి ఉన్న అత్యంత శక్తివంతమైన, అ త్యధిక మోతాదు పేలుడు పదార్థం (ఐఇడి)ని అమర్చుకుని సూసైడ్ బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తనను తాను పేల్చేసుకున్నాడని తే ల్చారు.
ఈ ఘటనలో 13మంది ప్రాణాలు తీ శాడు. పలువురు తీవ్రగాయాల పాలయ్యి, ఆసుపత్రిలో జీవన్మరణ దశలో ఉండేలా చేశాడు. అరెస్టు అయిన ఉమర్ సహాయకుడు అమీర్ రషీద్ అలీ విచారణలో ఈ ఆత్మాహుతి దాడి పూర్వాపరాలు వెలుగులోకి వచ్చాయి. ఐఇడి అమర్చుకుని సంచరించేందుకు అవసరం అయిన కారును అమీర్ ఉమర్ నబీకి సమకూర్చినట్లు వెల్లడైంది. ఈ మృత్యు శకటాన్ని ఆరోజు అంటే పేలుడు జరిగిన ఈ నెల 10వ తేదీన ఢిల్లీ వీధులలో నడిపింది స్వయంగా డాక్టర్ ఉమర్ ఉన్ నబీనే అని నిర్థారణ అయింది. దర్యాప్తు క్రమంలో ఇది అత్యంత ప్రధానమైన తొలి ముందడుగు అని ఎన్‌ఐఎ తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లోని పంపారే సమీపంలోని సంబూరా నివాసిగా అమీర్ రషీద్ అలీని గుర్తించారు. ఈ వ్యక్తి తన ప్రయోజనాల కోసం ఆత్మాహుతి టెర్రర్ బాంబర్ ఉమర్‌కు సహకరించాడు.
కుట్రకు కారుకు అమీర్ సహకారం
దాడి కుట్రకు ఆ వ్యక్తికి సహకరించాడని వెల్లడైంది. అమీర్ పేరిటనే దాడికి ఉపయోగించిన కారు రిజిస్టర్ అయి ఉందని ఎన్‌ఐఎ పరిశీలనలో వెల్లడైంది. ఈ వ్యక్తి ఢిల్లీకి ముందుగానే వచ్చి ఈ వాహనాన్ని కొనుగోలు చేసుకుని తరువాత ఐఇడి అమరే విధంగా తగు విధంగా మార్పులు చేర్పులు చేసినట్లు నిర్థారణ అయింది. మందుగుండు అమర్చిన వాహనాన్ని విబిఐఇడి వాహనంగా పిలుస్తారు. మృతుడు అయిన బాంబర్ ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. జనరల్ మెడిసిన్ విభాగంలో ఉద్యోగంలో ఉన్నాడు. డాక్టర్ వృత్తి చేస్తూ ఉగ్రవాదిగా జీవించాడు. ఉమర్ స్వస్థలం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా. నబీకే చెందిన మరో వాహనాన్ని కూడా నియా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. తగు సాక్షాధారాల కోసం దీనిని పరిశీలిస్తున్నారు. ఎర్రకోట దాడి ఘటనపై నియా వర్గాలు తమ దర్యాప్తును తీవ్రతరం చేశాయి. పలు ప్రాంతాలలో అనుమానితులను పట్టుకుని విచారిస్తున్నాయి.
బాంబర్‌గా మారాలని జాసిర్‌పై ఒత్తిడి
ఇప్పుడు బాంబర్‌గా మారిన ఉమర్ ఏడాదిగా తనకు బదులుగా వేరే ఎవరైనా ఆత్మాహుతి బాంబర్‌గా మారితే బాధ్యత అప్పగిస్తానని నెట్‌వర్క్ నిర్వాహకులకు ఏడాదిగా చెపుతున్నాడు. ఇందు కోసం చాలా నెలలుగా మరో వ్యక్తి కోసం యత్నించాడు. అయితే పలితం లేకపోవడంతో తానే బాంబర్ అయ్యి పేల్చుకున్నాడు. తనను ఆత్మాహుతి బాంబర్‌గా చేయాలని ఉమర్ యత్నించాడని కేసులో పట్టుబడ్డ జాసిర్ అలియాస్ డానిష్ ఇంటరాటగేషన్‌లో తెలిపాడు.