మనతెలంగాణ/హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గ డ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెట్ కెటిఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కర ణ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనున్నది. గతంలో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మూడు నెలల గడువులోగా స్పీకర్ నిర్ణ యం తీసుకోలేదని, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవై పు, ఎంఎల్‌ఎలపై విచారణకు సంబంధించి త మకు మరింత గడువు కావాలని కోరుతూ స్పీక ర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కెటిఆర్ పిటిషన్‌తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరుగనున్నది.