టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్‌లో భారత్‌కు చెందిన పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్‌కు చెందిన ధనుష్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు క్వాలిఫికేషన్‌లోనే రికార్డును తిరగరాసిన తెలుగుతేజం ధనుష్ ఫైనల్లో అసాధారణ ఆటను కనబరిచాడు.
ఆదివారం జరిగిన ఫైనల్లో ధనుష్ 251.7 పాయింట్లతో పసిడి పతకాన్ని గెలిచి అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన మహ్మద్ వానియాకు రజతం లభించింది. ఇక డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం గెలిచి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసిన ధనుష్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ధనుష్ శ్రీకాంత్ కోటి 20 లక్షల రూపాయల నగదును ఇస్తున్నట్టు రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం హనుమకొండలో ప్రకటించారు.