రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలిసింది. ఇరు వైపుల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని ఎస్పీ జితేంద్ర తెలిపారు. 2026 మార్చి 31 నాటికి ఛత్తీస్ గఢ్ ను మావోయిస్టు రహితంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా గతేడాది భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ లను చేపట్టాయి. మావోయిస్టుల లొంగుబాటుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఓ విధానాన్ని కూడా ప్రకటించింది. జనజీవన స్రవంతిలో కలిసిపోతే నెలకు పది వేల రూపాయలు ఇస్తామని తెలిపింది.