హైదరాబాద్: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ సమీపంలో లారీని ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న రాజధాని బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు దిండిగల్ కు చెందిన పులమాటి ఓం ప్రకాష్, మరొకరు హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.