మన తెలంగాణ/హైదరాబాద్: బిహార్ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలుపొందడం ఎంతో ఉరట ఇచ్చింది. బిఆర్‌ఎస్ నుంచి ఈ సీటు ను కైవసం చేసుకోవడం పట్ల పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ మీనాక్షి న టరాజన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది న నవీన్ యాదవ్‌ను వెంటబెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పార్టీ రాష్ట్ర నాయకత్వం శనివారం ఢిల్లీ వెళ్లింది. ఈ బృందం మొదట రాహుల్ గాం ధీతో, ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గేతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్‌తో కలిసి భేటీ అయింది.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిణమించి న జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకోవడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేల మాజార్టీతో గెలుపొందడం పట్ల కాంగ్రెస్ పెద్దలు పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా పార్టీ పెద్దలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ‘కీప్ ఇటప్, గోహేడ్’ అంటూ స్థానిక ఎన్నికలను వెంటనే నిర్వహించాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. ఈ నెల 17న జరిగే మంత్రిమండలిలోనే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నామని, బీసీలకు రిజర్వేషన్లను 42 శాతం పెంచెందుకు హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయస్థానాల నుంచి బ్రేక్ పడినప్పటికీ పార్టీపరంగా అయినా పెంచిన రిజర్వేషన్లను అమలు చేయాలని యోచిస్తున్నామని, దీనిపై మంత్రిమండలిలో సవివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ,
డిప్యూటీ సీఎం భట్టి విఅకమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ పెద్దలకు వివరించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా శాసనసభా, లోక్‌సభ ఎన్నికలలో రాజధాని నగరం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుపొందకపోయినప్పటికీ అనంతరం అక్కడ జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలను సాధించడంతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్, ఉప ఎన్నికల్లో పార్టీకి పెరిగిన ఓట్ల శాతంపై గ్రాఫిక్స్‌తో సహా పార్టీ పెద్దలకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది. స్థానిక ఎన్నికలు త్వరగా పూర్తి చేయగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కాలపరిమితి ముగియనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలు జరుగునున్నాయని, ఆ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల స్పూర్తితో జిహెచ్‌ఎంసిని కైవసం చేసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ నేతలంతా సమన్వయంతో వ్యవహరిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదని, ఇప్పటి మాదిరిగానే ఏకత్రాటి నిలిచి రాబోయే ఎన్నికలను సమిష్టిగా ఎదుర్కొవాలని పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలిసింది.
పార్టీ నేతల మధ్య, ముఖ్యంగా మంత్రుల మధ్య అప్పుడప్పుడు తలెత్తుతున్న విభేదాలు పార్టీని, ప్రభుత్వాన్ని బలహీన పరచడంతో పాటు ప్రజలలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరించినట్టు తెలిసింది. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, అలాంటి వాటిపై రాష్ట్ర నాయకత్వం ఎంతటి కఠిన చర్య తీసుకున్నా అందుకు అధిష్టానం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్టు తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితంతో మరోసారి విధితం అయినట్టేనని పార్టీ పెద్దలు సంతృప్తిని వ్యక్తం చేసినట్టు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలహామీల అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఒక్కోక్కటి అధిగమిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొనడం తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయం సాధించగలిగిందన్న రాష్ట్ర నాయకత్వం విశ్లేషణతో పార్టీ పెద్దలు ఏకీభవించినట్టు తెలిసింది.