మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ అయింది. www. tshc.gov.in వెబ్‌సైట్‌లో పిడిఎఫ్‌లను ఈ నెల 11న అప్‌లోడ్ చేస్తుండగా అంతరా యం ఏర్పడి ఓ లింక్ వచ్చి బెట్టింగ్ సైట్‌గా ప్రత్యక్షం అయింది. వెంటనే అప్రమత్తమైన హైకోర్టు సిబ్బంది వెబ్‌సైట్‌పై సైబర్ అటాక్ అయిందని గుర్తించారు. హైకోర్టు ఐటి రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరావు సైబర్ అటాక్ గురించి తెలంగాణ రాష్ట్ర డిజిపి శివదర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బిఆర్‌కెఆర్ భవన్‌లోని నేషనల్ ఇన్‌ఫర్‌మెటిక్స్ నుంచి హై కోర్టు వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్‌లో కేసుల సమాచారం, స్టేటస్ సమాచారం, నోటిఫికేషన్లు, నోటీసులు తదితరా లు మొత్తం ఉన్నాయి. పిడిఎఫ్‌లు అప్‌లోడ్ చేస్తుండగానే రీడైరెక్ట్ అయి గేమింగ్ అప్లికేషన్ బిడిజి స్లాట్ ఓపెన్ అవుతోంది. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సెక్షన్ 66 రెడ్‌విత్ 43, 66(సి), 66(డి) ఐటి యాక్ట్, సెక్షన్ 337, బిఎన్‌ఎస్ సెక్షన్ 3(1), (ఐ) తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.