కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామం లోని అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో శనివారం మద్యాహ్నాం ఊరకుక్కలు దాడి చేయడంతో ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఐదేండ్ల బాలుడు కుంబం అభితేజనంద స్వల్పంగా గాయపడ్డాడు. అభితేజానంద ముత్యంపల్లి అంగన్‌వాడీ కేంద్రంకు వెళ్లి ఇద్దరు మహిళలతో కలసి వస్తుండగా కేంద్రం సమీపంలో ఒక్క సారిగా ఊర కుక్కలు అభితేజానందపై దాడికి పాల్పడడంతో మహిళలు కేకలు వేయడంతో అక్కడే ఉన్న పలువురు ఊరకుక్కల ను చెదరగొట్టడం తో పెద్ద ప్రమాదం తప్పింది. అయనప్పటికి అభితేజానంద పై ఊర కుక్కలు దాడికి పాల్పడిన నేపద్యంలో బాలుడికి నడుము పై రక్త కాటు, పిరుదులపై కుక్కల కాలి గోళ్లు గీరుకు పోవడంతో స్పల్పగాయాలయ్యాయి.
వెంటనే బాలుడిని ప్రక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లడంతో సిబ్బంది వైద్య సేవలు అందించినట్లు బాలుడి తండ్రి తిరుపతి తెలిపారు. ఇక్కడ నిత్యం ఊర కుక్కలు మనుష్యులపై దాడులకు పాల్పడుతున్నాయని అక్కడి గ్రామస్తులు తెలిపారు. ఇటీవల మోడల్ పాఠశాల సమీపంలో ఊర కుక్కలు దాడి చేయడం తో తీవ్రంగా గాయ పడిన అక్షిత పై కూడా మళ్లీ కుక్కలు దాడికి పాల్పడగా గ్రామస్తులు కుక్కలను తరిమినట్లు వారు తెలిపారు. ముత్యంపల్లి పంచాయితీ పరిదిలో ఊర కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, రాత్రి అయిందంటే వాహానాలపై వెళ్లె వారిపైకి దూసుకు వెళ్లుచున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఊరకుక్కల భారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుచున్నారు.