హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడి నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐబొమ్మ వెబ్‌సైట్, సర్వర్ నుంచి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఇమ్మడి రవి విశాఖపట్నంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కూకట్‌పల్లిలోని అతడి అపార్ట్‌మెంట్ నుంచి కంప్యూటర్లు, వందల హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వాడిన సర్వర్లను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి ఇమ్మడి రవి కోట్ల రూపాయిలు సంపాదించినట్లు తెలిసింది.