స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రజా భవన్‌లో శనివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో, ఆదివాసుల స్వేచ్ఛా పోరాటంలో బిర్సా ముండా సేవలను మంత్రి సీతక్క గుర్తు చేసుకున్నారు.