ఢిల్లీ: ప్రజల్లో వ్యతిరేకతల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ నెలకొంది. ఈ విజయం అనంతరం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. సిఎం రేవంత్ తోపాటు ఏఐసిసి ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ లు ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే.. నవీన్ యాదవ్ ను అభినందించారు. అనంతరం తెలంగాణలో తాజా పరిస్థితులు, బిసి రిజర్వేషన్ అంశం, స్థానిక సంస్థల ఎన్నికలపై ఖర్గే చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు రాహుల్ గాంధీతోనూ వీరు భేటీ అయ్యారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ ప్రత్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలుపొందారు.