రాష్ట్రంలో పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు నిర్వహించింది. 13 మంది సబ్ రిజిస్టార్ అధికారులు ఇళ్లల్లోనూ సోదాలు జరిపింది. సబ్ రిజిస్టార్ అధికారులు ఇళ్లల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదులు రావడంతో ఎసిబి ఈ తనఖీలు నిర్వహించింది. పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవకతవకలు గుర్తించింది. ఎసిబి తనిఖీలు లెక్కలు చూపని రూ.2.51 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. కార్యాలయాల్లోనే అక్రమంగ ఉన్న 289 రిజిస్ట్రేషన్ పత్రాలను గుర్తించింది. డాక్యుమెంట్ రైటర్ల మితిమీరిన జోక్యాన్ని ఎసిబి అధికారులు గుర్తించారు. 19 ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లను గుర్తించారు. పలు కార్యాలయాల్లో సిసిటివి కెమెరాలను పని చేయట్లేదని తెలుసుకున్నారు. సిబ్బందే ఉద్దేశపూర్వకంగా సిసి కెమెరాలను ఆఫ్ చేసినట్లు విచారణలో తెలిసింది.