న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. నవీన్‌తో పాటు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలను అభినందించారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌కు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరిని రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విజయం గురించి రాష్ట్ర నేతలు రాహుల్‌కు వివరించారు.