ఇంట్లో వెలిగించిన దీపం రగిలి మంటలు చెలరేగిన సంఘటన శుక్రవారం ఇల్లందు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే స్ధానికుల కథనం ప్రకారం జగదాంబసెంటర్‌లోని ఆడెపు లక్ష్మికాంతం తన ఇంట్లో పటాల వద్ధ దీపం వెలిగించి ఆరుబయట మహిళతో కలిసి కూర్చోని ముచ్చటిస్తున్నారు. ఇంతలోనే ఇంట్లో నుండి దట్టమైన పొగలు మంటలు రావడాన్ని గమనించిన స్ధానికులు హుటాహుటిన ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించగా చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పరిస్ధితి అదుపులోకి రావడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినప్పటికి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఇకపోతే మంటలు చెలరేగిన సమయంలో ఆప్రాంతంలో కరెంట్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.