హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో తమ కార్యకర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ గూండాయిజం చేస్తోందని అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ విజయగర్వంతో విర్రవీగడం సరికాదని, బిఆర్ఎస్ శ్రేణులపై దాడులకు.. సిఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని సూచించారు. తాము కూడా అనేక ఎన్నికల్లో గెలిచామని, ఇలా దాడులు చేయలేదని విమర్శించారు. తనది అహంకారమో.. సిఎం రేవంత్ రెడ్డి ది అహంకారమో.. ప్రజలు చూస్తున్నారని అన్నారు. విజయ గర్వంతోనే నిన్న ఊరేగింపు నిర్వహించారని కెటిఆర్ పేర్కొన్నారు.