హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రచారం చేయకే జూబ్లీహిల్స్ లో ఓడిపోయామని అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మోసం చేయడం హరీశ్ రావు నైజం అని..అన్నారు. ఈ సందర్భంగా మెదక్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు అనుచరులు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారని, మెదక్ లో ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నారని కవిత తెలియజేశారు. తాను బయటకు వచ్చి ప్రజా సమస్యలపై తిరుగుతున్నానని.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని, బిఆర్ఎస్ ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడమే సరిపోతుందని కవిత విమర్శించారు.