కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు కాస్త తడబడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి తొలి రోజు ఆట ముగించుకుంది. అయితే రెండో రోజు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.
సైమన్ హార్మర్ ఓవర్‌లో స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నంలో గిల్ మెడ పట్టేసింది. అతడు మెడను పూర్తిగా కదల్చలేని విధంగా కనిపించాడు. ఫిజియో వచ్చి అతడిని చికిత్స అందించినప్పటికీ.. గిల్ కోలుకోలేకపోయాడు. దీంతో ఫిజియో సాయంతో గిల్ మైదానం వీడాడు. గిల్ గాయం గురించి బిసిసిఐ అప్‌డేట్ ఇచ్చింది. గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడని.. అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. అతడి రికవరీని బట్టి ఈ రోజు ఆటలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామని ఎక్స్‌లో స్పష్టం చేసింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ప్రస్తుతం 56 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజ్‌లో అక్షర్ పటేల్ (2), మహ్మద్ సిరాజ్ (0) ఉన్నారు. భారత్ ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాపై 13 పరుగుల ఆధిక్యంలో ఉంది.