పట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 లో బీజేపీ- జెడీ(యు) కూటమి రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించింది. బీహార్ ఎన్నికల లో కులం ఎప్పుడూ కీలకమైన అంశమే. గెలుపు ఓటముల నిర్ణయాత్మక శక్తిగా భావిస్తున్నారు. 2023 అక్టోబర్ లో నిర్వహించిన కులగణన ప్రకారం 13 కోట్లకు పైగా ఉన్న జనాభా లో 60 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారు. 85 శాతం మంది బిసి, ఇబిసీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారని తేలింది. ఎన్డీయే ఘన విజయానికి పునాదిని అత్యంత వెనుకబడిన తరగతులు, ఇ తర వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులా లు, తెగల ఓటర్ల బలమైన మద్దతు అంటున్నా రు. మహా ఘట్బంధన్ ముఖ్యంగా ముస్లిం, యాదవ్ సమాజం ఓట్ల బలమే ప్రధానంగా పోటీ చేసిందని భావించారు. ఈ సారి ఎన్నికలలో కులం కార్డ్ ఎన్డీఏకు అనుకూలంగా ఉందని తేలింది. ఉదాహరణకు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చెందిన కుర్మి, కోయిరీ కమ్యునిటీ అశ్చర్యకరంగా 31.9 శాతం వర కూ ఓటు వేసింది.
బీహార్ జనాభాలో 2.6 శా తం ఉన్న నిషాద్ (మల్లా) కమ్యునిటీ ని విఐపీ నాయకుడు ముఖేష్ సహానీకి మద్దతు ఇవ్వ డం ద్వారా ప్రతిపక్షాలు ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టాలని ఆశించాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన 60శాతం కన్నా ఎక్కువ మంది ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థులకు ఓటు వేసినట్లు భావిస్తున్నారు. కుష్వాహా కమ్యునిటీకి చెందిన వా రు కూడా ఎన్డీయేకు అత్యధికంగా ఓట్లు వేసినట్లు కన్పిస్తోంది. ఆ వర్గానికి చెందిన ఓటర్లు 41 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉన్నారు. అయితే 9 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు పైచేయి సాధించడం విశేషం. ఆశ్చర్యకరంగా, పాశ్వాన్ కమ్యునిటీ ఓట్లు కూడా మహాఘట్బంధన్ కు దూరమయినట్లు కన్పిస్తోంది. చిరాగ్ పాశ్వాన్‌కు చెంది న లోక్ జనశక్తి పార్టీ అద్భుత ఫలితాలకు అదే కారణం. లోక్ జన శక్తి పార్టీకి ఎన్డీఏ కూట మి 28 సీట్లు కేటాయించింది. వాటిలో 19 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది.
ఆ ర్థికంగా వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన తరగతులు రెండూ అధికార ఎన్డీఏకు అండగా నిలిచినట్లు కన్పిస్తోంది. అందువల్ల ఎన్డీయే అంచనాలను మించి , ఆవర్గాలనుం చి 63 శాతం కంటే ఎక్కువ మద్దతు, ఎస్సీ ల నుంచి 74 శాతం కన్నా ఎక్కువ మద్దతు పొం దాయని ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే, ముస్లిం, యాదవ్ కమ్యునిటీలు నూటి కి నూరు శాతం మహా కూటమికి అనుకూలం గా లేవని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈ ఓట్లలో 65 శాతం ఎన్డిఏ సాధించి ఉండవచ్చునని భావిస్తున్నారు. రాఘోపూర్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కంచుకో ట. 1995 నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన భార్య రబ్రీదేవి, లేదా ఆమె కుమారుడు తేజశ్వీ యాదవ్ లు ఈ స్థానం నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. ఈ సారి 2025లోనూ తేజశ్వీయాదవ్ ఈ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. ఒక్క 2010లో మాత్రం ఈ స్థానం నుంచి రబ్రీదేవి ఓడిపోయారు.