హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఫ్రాన్స్ నుండి ఇండియాకి ఇమ్మడి రవి వచ్చాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు అతడి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. సినీ ప్రముఖులు, పోలీసుల వ్యక్తిగత విషయాలు బయటపెడుతానని బెదిరింపులకు పాల్పడిన రవిని పోలీసులు ఆరు నెలల నుంచి వెతుకుతున్నారు. సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే హెచ్‌డి ప్రింట్ల పైరసీ చేసి అప్‌లోడ్ చేసేవాడు. దీంతో సినీ పరిశ్రమ వేల కోట్లలో నష్టం కలిగించేవాడు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాడు. రవి అరెస్టు కావడంతో తెలుగు సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు.