అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో దారుణ హత్య చోటుచేసుకుంది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. గ్రామ సమీపంలో వంశీకృష్ణ యాదవ్ ను గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరకడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.