అమరావతి: టిటిడి మాజీ ఎవిఎస్ఒ సతీష్‌కుమార్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై చంపి పడేశారని శవ పరీక్షలో తేలింది. సిఐ సతీష్ తలపై నరకడంతో పాటు శరీరంలో పలు చోట్లు ఎముకలు విరిగిపోయాయని పోలీసులు వెల్లడించారు. తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై టిటిడి మాజీ ఎవిఎస్ వి సతీష్‌కుమార్ మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ కుమార్ మృతదేహాన్ని డిఐజి షిమోషి, ఎస్ పి జగదీష్ పరిశీలించారు. తిరుమల పరకామణి అక్రమాల కేసులో సిఐ సతీష్ కుమార్ ఫిర్యాదు దారుడిగా ఉన్నారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా సతీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టిటిడి పరకామణి కేసులో కీలక వ్యక్తి మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తనకు ప్రాణహాని ఉందని తరచూ చెప్పేవారని సతీష్ కుమార్ స్నేహితుడు రామాంజనేయులు తెలిపాడు. పరకామణి కేసు వల్లే సతీష్ ప్రాణం పోయిందిని ఆరోపణలు చేశారు. సతీష్ సూసైడ్ చేసుకునే వ్యక్తి మాత్రం కాదు అని, పైఅధికారుల నుంచి భారీ ఒత్తిడి ఉందని తమకు పలుమార్లు చెప్పేవారని స్నేహితుడు రామాంజనేయులు ఆరోపణలు చేశాడు.
2003లో ఏప్రిల్‌లో టిటిడి ఉద్యోగి రవికుమార్ శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ఎవిఎస్‌ఒ హోదాలో రవికుమార్‌పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు రవికుమార్, సతీష్ కుమార్ ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఆస్తులను కొంతమేర టిటిడికి ఇవ్వగా మరికొన్ని ఆస్తులు సతీష్ పేరుపై రాయించుకొని కేసు మాఫీ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సతీష్ చాలా రోజులు రిజర్వ్ పోలీస్ విభాగంలో పని చేశాడు. డిప్యుటేషన్‌పై టిటిడిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. 2022లో ఎవిఎస్‌హోగా పదోన్నతి లభించడంతో టి టిడి ఆలయంలో సతీస్ విధులు నిర్వహించిన విషయం విధితమే
–