పాట్నా : జాతీయ రాజకీయాల ప్రయోగశాలగా భావించే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ ప్ర భంజనం సృష్టించింది. బీహార్ సిఎం నితీశ్, ప్ర ధాని మోడీ ద్వయం దెబ్బకు విపక్ష మహాఘట్బంధన్ కోలుకోలేని దెబ్బతింది. శత్రువులకు కూడా ఊహకందని రీతిలో ఎన్నికల రణరంగంలో డబు ల్ సెంచరీ బాదేసింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను కూడా పక్కకు నెట్టేస్తూ 243 స్థానాలున్న బీహార్ శాసనభలో 203 స్థానాలు కైవసం చేసుకుంది. అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 122 స్థా నాల మైలురాయిని సునాయసంగా దాటేసిది. తద్వారా చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. 2/3 మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని తిరిగి ఎన్‌డిఎ చేజిక్కించుకుంది. ఆర్‌జెడి, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 34 స్థానాలకే పరిమితమైంది. ఇక హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఎంపి అసదుద్దీన్ నా యకత్వంలోని
మజ్లిస్ పార్టీ5 స్థానాల్లో విజయం సాధించి ఉనికిని చాటుకుంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్‌కు చెంది న జన్ సురాజ్ పార్టీ జనం ఆదరణను చూరగొనలేక సున్నా చుట్టేసింది. ఎన్‌డిఎగా బరిలో దిగిన బిజెపి ఈ ఎన్నికల్లో 90 స్థానాలు గెలుచుకుని అ తిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత నితీశ్ నాయకత్వంలోని జెడి(యు) 85 స్థానాలు, కేం ద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జెపి 19, ఆర్‌ఎల్‌ఎం 4 స్థానాలు దక్కించున్నా యి. మహాకూటమిలోని పార్టీల్లో ఆర్‌జెడి 25, కాంగ్రెస్ 6, సిపిఐఎంఎల్ 2, సిపిఎం 1 స్థానాల కే పరిమితమయ్యాయి. అధికార ఎన్‌డిఎ కూటమికి చెందిన డిప్యూటీ సిఎంలు సహా మెజారిటీ మంత్రులు తిరిగి ఎన్నికల్లో విజయం సాధించా రు. విపక్ష నేత తేజస్వీ యాదవ్ అత్యంత నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ నడుమ రఘోపూర్ నుంచి విజయం సాధించారు. సొంతంగా మహు వా నుంచి బరిలో నిలిచిన లాలూ చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ మూడో స్థానంతో అపజయం మూటగట్టుకున్నారు.
విజయాన్ని తెచ్చిపెట్టిన ఎన్‌డిఎ ప్రచారాస్త్రాలు
ప్రధాని మోడీ, నితీశ్ కుమార్ సహా కేంద్ర మం త్రులు, కూటమిలోని ఆయా పార్టీల అధినేతలు ఆర్‌జెడి, కాంగ్రెస్‌ను లక్షంగా చేసుకుని జంగిల్ రాజ్‌ను తిరిగి రాష్ట్రంలో పాదం మోపనియ్యవద్దని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. డబుల్ ఇం జిన్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమ ని చేసిన ప్రచారం ఫలితాన్ని ఇచ్చిందని విశ్లేషకు లు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముంగిట మహిళల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయడం వారి ని ఆకట్టుకోవడమే కాకుండా పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చేలా చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటన్నింటిని ముందు విపక్ష కూటమి అ భివృద్ధి మంత్రం, రాష్ట్రాన్ని ఇంకొకరి చేతిలో పెట్టవద్దంటూ తేజస్వీ యాదవ్ పరోక్షంగా బిజెపిపై చేసిన విమర్శలు ఓటర్లను ఆకర్షించలేదు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్ర విఫలయాత్రగానే మిగిలిపోయింది. ఓటు చోరీ అంటూ కాలికిబలపం కట్టుకుని చేసిన ప్రచారం ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది.
బిజెపికి బూస్ట్…
బీహార్‌లో ఓట్ల , సీట్ల శాతంతో బిజెపి వచ్చే ఏడా ది జరిగే పలు అసెంబ్లీ ఎన్నికలలో తన పట్టు మరింత బిగిస్తుందని విశ్లేషించారు. గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపి స్థానాలు తగ్గాయి. దీనితో నిర్థిష్టంగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. ఢిల్లీ , మహారాష్ట్ర, హర్యానా తరువాత బీహార్‌లో బిజెపికి వరుస క్రమం విజయం దక్కిం ది. ఈసారి ఎన్నికలలో జెడియు బలం కూడా పెరిగింది. 2020లో కేవలం 43 సీట్లు పొందిన జెడియు ఇప్పుడు 19 శాతం ఓట్ల వాటాతో 85 స్థానాలు గెలిచింది.
బీహార్‌లో కొత్తగా ‘ఎంఇ’ ‘ఎంవై’ ఫార్ములా
బీహార్‌లో ఈసారి ఎన్నికలలో ప్రధానంగా రెండు కీలక సమీకరణలు ముందుకు వచ్చాయి. ఎన్‌డిఎ వ్యూహకర్తలు రాష్ట్రంలోని మహిళలు, ఇబిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ‘ఎంఇ’ గా పనిచేసింది. మహిళలకు , ఇబిసిలకు పలు విధాలుగా ప్రాధాన్యత ఇవ్వడంతో ఎక్కువగా ఓటును ప్రభావితం చేసే మహిళలు, బిసిలు ఎన్‌డిఎకు పట్టం కట్టారు. ఆర్జేడీ వ్యూహంతో ముందుకు వచ్చిన ముస్లిం, యాదవ్ (ఎంవై) సమీకరణ పనిచేయలేదు. చివరికి యాదవ్‌లు కూడా ఘట్‌బంధన్‌కు దూరం అయ్యేలా చేసిందని వెల్లడైంది.