రాయల్ ర్యాప్చీ సంస్థ ‘టీబీడీ’ ఓటీటీని దుబాయ్‌లో లాంచ్ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన లోగో లాంచ్ కార్యక్రమానికి సంస్థ ఎండి ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, డి.యస్.రావు, వి. సముద్ర, వి.యన్. ఆదిత్య, చంద్రమహేష్, ఇ.సత్తిబాబు, శివనాగు, బసిరెడ్డి, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిబిడి ఎండి ధరమ్‌గుప్తా మాట్లాడుతూ టిబిడి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ నెలకు కేవలం రూ.10 మాత్రమేనని అన్నారు.