బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోగా, అక్కడ పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసికి చెందిన ఎంఐఎం పార్టీ మరోసారి తన పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ తన సత్తా చాటింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాలను ఏఐఎంఐఎం గెలుచుకుంది. ఆ పార్టీ వర్గాల సమాచారం మేరకు అమౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అక్తర్ ఉల్ ఇమాన్, బహదూర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తౌసీఫ్ ఆలం, జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ ముర్షీద్ ఆలం, బైసి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గులాం సర్వార్, కొచధమాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ సర్వార్ ఆలం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలను 2020 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ గెలుచుకుంది.