కోల్‌కతా: ప్రస్తుత తరం బౌలర్లలో టాప్ బౌలర్ ఎవరంటే.. అందరు చెప్పే పేరు జస్ప్రీత్ బుమ్రా. తనదైన శైలీ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో బుమ్రా ముందుంటాడు. అతడు బౌలింగ్ వస్తున్నడంటే.. ప్రత్యర్థ బ్యాటర్ల కాస్త జంకుతారు. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనూ బుమ్రా మరోసారి సూపర్ స్పెల్ బౌలింగ్ చేశాడు. మూడు కీలక వికెట్లు తీసి.. తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు.
ఈ నేపథ్యంలో బుమ్రా ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో కనీసం 200 వికెట్లు తీసుకున్న బౌలర్లలో అతి తక్కువ యావరేజ్ నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 51 టెస్టుల్లో 19.70 యావరేజ్‌తో 228 వికెట్లు తీశాడు. దీంతో టెస్టుల్లో 200లకు పైగా వికెట్లు తీసి 20 కన్న తక్కువ యావరేజ్ ఉన్న బౌలర్ కేవలం బుమ్రా మాత్రమే కావడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్ 20.9 యావరేజ్‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో రబడా (22), కమ్మిన్స్ (22.1) ఆ తర్వాతి స్థానంలో నిలిచారు.
ఇక తొలి టెస్ట్‌లో బుమ్రా మూడు, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. దీంతో 43 ఓవర్లలో సౌతాఫ్రికా 144 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో వెర్రెయిన్(15), స్టబ్స్ (10) ఉన్నారు.