హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. వరసగా ఏడు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది. 7వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4,030 ఓట్ల ముందంజలో ఉంది. ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 19,619 ఓట్ల ఆధిక్యం కలిగి ఉంది. ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీకి భారీ ఓటమి ఖాయం కావడంతో జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు బయటకు వస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు ఒక్కొక్కరుగా కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వస్తున్నారు.
తొలి రౌండ్:
కాంగ్రెస్: 8926
బిఆర్‌ఎస్: 8864
రెండో రౌండ్:
కాంగ్రెస్: 9691
బిఆర్‌ఎస్: 8609
మూడో రౌండ్:
కాంగ్రెస్: 11082
బిఆర్‌ఎస్:8083
బిజెపి: 1866