పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్‌డిఎ 135 స్థానాల్లో ముందంజలో ఉండగా మహాఘట్‌బంధన్ 81 స్థానాల్లో ఆధిక్యం, జెఎస్ పి 1, ఇతరులు 4 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాఘెపూర్ లో ఆర్జెడి అభ్యర్థి తేజస్వీయాదవ్ ముందంజలో ఉండగా అలీనగర్ లో బిజెపి అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. మహువాలో జెజెడి అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్, తారాపూర్ లో బిజెపి అభ్యర్థి సామ్రాట్ చౌదరీలు ముందంజలో ఉన్నారు.