విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ను వినోదం, సందేశంతో నిజాయితీగా చేశాం. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వస్తున్న స్పందనతో సంతృప్తిగా ఉన్నాం. ఇదే స్పందన సినిమా విడుదల తర్వాత థియేటర్లలో వస్తే ఇంకా సంతోషి స్తాం. సినిమా విజయంపై మా టీమ్ అంతా నమ్మకంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్‌తో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ సినిమా విడుదలవుతోంది. మన దగ్గర వచ్చే టాక్ ను బట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ వస్తుందని నమ్ముతున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ యూఎస్‌లో రిలీజ్ చేస్తున్నారు”అని అన్నారు.
దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాలో మేము ఏ సీన్స్‌లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని ఆశించామో వాటితో పాటు మేము ఊహించని సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న సన్నివేశాలకు కూడా నవ్వుతున్నారు. ప్రివ్యూస్ వేసిన థియేటర్స్ నుంచి వస్తున్న స్పందనతో హ్యాపీగా ఉన్నాం. థియేట్రికల్‌గా వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నాం”అని తెలిపారు.