మన తెలంగాణ/సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ విషాదం చోటుచేసుకుంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) గత రాత్రి గుండె పోటుతో కన్నుమూశాడు. ఎర్రగడ్డలోని తన నివాసంలో ఆయన మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 22న నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆయన నిమినేషన్‌ను ఆమోదించారు. ఫలితాలకు ఒక రోజు ముందు అన్వర్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ ఫలితంపై రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్రజల్లోనూ, మరోవైపు అధికార వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఒక నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు పోటీపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే ఉన్నదనేది బహిరంగ రహాస్యం. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10రౌండ్‌లు లెక్కింపు జరుగనున్నది.