అవగాహన కల్పించేందుకు, మధుమేహ సంరక్షణ వ్యక్తులకు అందుబాటులోనికి తేవడం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం జరుపుకుంటారు. ఈ దినోత్సవం అనేది మధుమేహం గురించి అవగాహన పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణ మరియు నివారణ ప్రాముఖ్యతను హైలైట్ చేయడం, అందరికీ చికిత్స, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగైన సేవల కోసం చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రపంచ ఆరోగ్య ప్రచార దినం..
మధుమేహం అనేది ఒక జబ్బు కాదు అది ఒక సాధారణ స్థితి.. మన క్లోమగ్రంధి కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉన్న ఇన్సులిన్ మన శరీరంలోని కణజాలాలలోకి వెళ్లకపోవడం లాంటి సమస్యలతో వస్తుంది. నిర్దిష్ట మోతాదులో అనగా 90 నుంచి 110 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా రాండమ్ 160 కంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు మనకు డయాబెటిస్ ఉంది అని తెలుస్తుంది.. కానీ రాండం బ్లడ్ షుగర్ 180 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది డేంజరస్ గా మారుతుంది.. కిడ్నీ ద్వారా గ్లూకోజ్ బయటికి వస్తుంది.
ఎక్కువ కాలం మధుమేహం ఉండడం వలన అనగా 20 లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అది అన్ని ఆర్గాన్స్ను డ్యామేజ్ చేస్తుంది.. కొందరికి కళ్ళు కొందరికి కిడ్నీలు కొందరికి లివర్ కొందరికి హార్ట్ ఇలా అది డ్యామేజ్ చేయని ఆర్గాన్ అంటూ ఉండదు. దీనిని కనుక్కోవడం చాలా సులభం.. మీకు మూత్రం ఎక్కువగా వస్తూ ఉన్నా లేదా ఎక్కువగా ఆకలి అవుతున్న లేదా బాగా తిన్నగాని బరువు తగ్గుతూ ఉన్న డయాబెటిస్ ఉన్నట్లే అప్పుడు మీరు రక్తం పరీక్ష ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
దీనిని రివర్స్ కంప్లీట్ గా చేయలేము కేవలము మెయింటెన్ చేయగలము.. మీకు డయాబెటిస్ ఉంది అని నిర్ధారణ అయిందా మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు.. మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు.. ప్రతిరోజు ఉదయం లేచి వాకింగ్ చేయండి.. మరియు తక్కువ పిండి పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోండి.. దీనితో చాలామందికి కంట్రోల్ వస్తుంది అయినా కానీ కంట్రోల్ రాకుంటే ఇంకా మూడవ ప్రయత్నం గా మాత్రలు వాడొచ్చు.
మీరు ఒక 900 రూపాయలు పెట్టి ఒక షుగర్ టెస్టింగ్ మిషన్ కొనుక్కొని వారానికి ఒకసారి పొద్దున లేస్తానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండండి అంతే ఇంకా మీకు ఎటువంటి ప్రమాదము లేదు.. కొందరికి మాత్రలతో కంట్రోల్ కాకుంటే ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది. కొందరికి టైప్ వన్ డయాబెటిస్ అని వాళ్లలో ఆటోఇమ్యూన్ డిసీస్ వలన క్లోమంలోని బీటా సెల్సు డామేజ్ అయిపోయి ఉంటాయి.. వారికి ఇన్సులిన్ వాడడం తప్పదు..
ఎవరైనా పిండి పదార్థాలు తినడం ఆపేసి కేవలము మటన్ చికెన్ తింటూ డయాబెటిస్ ను పూర్తిగా పోతుంది అంటే అది వారి అవగాహన లోపం లేదా వారికి దీని మీద ఎటువంటి అవగాహన లేదు అని అర్థం… అలా చేయడం వలన కొంత వెయిట్ లాస్ అయ్యి బరువు తగ్గడం వలన ఫ్యాట్ తగ్గడం వలన కొంచెం డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. కానీ మీరు ఆ మాత్రలు పూర్తిగా ఆపేస్తే తిరిగి డయాబెటిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది.. ఎందుకంటే అది డయాబెటిస్ అనేది ఒక రోగం కాదు అది ఒక మెటబాలిక్ అబ్నార్మాలిటీ. డయాబెటిస్ ఎప్పుడూ మనము కంట్రోల్ లోనే ఉంచుకోవాలి అంతేకానీ దానిని రూపుమాపడం అనేది కలగా ఉంటుంది.
కావున చిట్కాలు మానేసి, వాటిని వినడం మానేసి, కేవలం తరచూ పరీక్షలు చేసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, జిహ్వను అదుపులో పెట్టుకుని మనము తగినంత ఆహారాన్ని తీసుకోవడం పాటు అవసరమైతే ఇన్సులిన్ లేక మందులు వాడుతూ డయాబెటిస్ ను కంట్రోల్ లో పెట్టుకుంటే మీకు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ అవయవాలు చెడిపోయే అవకాశం ఉండదు. ఒకసారి డయాబెటిస్ వస్తే అది పోదు, కేవలం దానిని కంట్రోల్లో మాత్రమే పెట్టుకోగలము అది మీ చేతిలోనే ఉంది. మీరు ఏమంటారు?
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్
గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు