మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్ర వ్యా ప్తంగా పలు జిల్లాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల చేపట్టిన ఆకస్మిక దా డులతో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడుల్లో రైస్ మిల్లర్లు కో ట్లాది రూపాయల విలువ చేసే సిఎంఆర్ ధాన్యం దారిమళ్లినట్టు అధికారులు కనుగొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, రం గారెడ్డిజిల్లా శంషాబాద్, మహబూబ్ నగ ర్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ధాన్యం బస్తాలు మాయం అయినట్లు గుర్తించారు.నిర్మల్‌జిల్లా కడెం ప్రాంతంలో రైస్ మిల్లర్లు భారీగా సిఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్ళించారనే విశ్వసనీయ సమాచారం అందడంతో కరీంనగర్ విజిలెన్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన బాలాజీ రైస్ మిల్లులో సోదాలు నిర్వహించగా 2024,-25 రబీ సీజన్‌కు సంబంధించి 2,684 మెట్రిక్ ట న్నుల సిఎంఆర్ ధాన్యం దారి మళ్లించార ని, వీటి విలువ 6.22 కోట్లు ఉంటుందని తెలుసుకున్నారు. సదరు మిల్లు యజమానిపై తదుపరి చర్యలు తీసుకునేలా పౌరసరఫరాల శాఖకు నివేదిక అప్పగించారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డా కూర్‌లో ఎంఎస్ కన్యకా పరమేశ్వరి ఆ గ్రో ఇండస్ట్రీస్‌లో ఆర్సీపురం ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ పౌర సరఫరాల శాఖతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో రబీ 2024,-25 సీజన్‌కు సంబంధించిన 3,752.80 క్వింటాళ్ల సిఎంఆర్ ధాన్యం (382 బస్తాలు) తక్కువగా ఉన్న ట్లు తేల్చారు. వీటి విలువ సుమారు రూ. 87,06,496 ఉంటుందని సదరు మిల్లు యజమానిపై చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల విభాగానికి సిఫార్సు చేశారు. ఈనెల 12వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని చాముండి రైస్ మిల్లు, వరాహి రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. రబీ, ఖరీఫ్ 2024,-25 సీజన్‌కు సంబంధించిన మొత్తం 1,47,375 బస్తాల సిఎంఆర్ ధాన్యం స్టాకును దారి మళ్లించినట్లు అధికురు నిర్ధారించారు. వీటి విలువ సుమారు రూ. 13.67 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులకు తెలియజేయనున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.
రూట్ చెకింగ్‌తో అధిక లోడ్ వాహనాలకు చెక్
అకస్మిక దాడులతో తనిఖీలు చేస్తుంటే, మరోవైపు రూట్ చెకింగ్‌తో అధికలోడ్ వాహనాలు, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా తప్పించుకున్న వాహనాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ రూరల్ యూనిట్ అధికారులు శంషాబాద్ నుండి మహబూబ్‌నగర్‌కు పిడిఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఒక డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిమితులలోని పెద్ద షాపూర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి-44పై సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 15 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్రిమినల్ కేసుతో పాటు ఈసీ చట్టం కింద 6ఏ కేసు నమోదు చేయాలని పౌర సరఫరాల అధికారికి సిఫార్సు చేశారు.
అదే రోజున హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు రవాణా, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి భూత్పూర్, జడ్చర్ల నుండి కొడంగల్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిపై రూట్ లో నిర్వహించిన తనిఖీల్లో అధిక లోడ్ తో వెళ్తున్న వాహనానికి రూ. 2,80,000జరిమానా విధించారు. రాయల్టీ ఉల్లంఘించినందుకు రూ.40 వేలు జరిమానా విధించారు. సరైన పత్రాలు లేని రూ. 2 లక్షల విలువ కలిగిన ఒక వాటర్ ట్యాంకర్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 17 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, తాడూరు పోలీస్ స్టేషన్లకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఫైర్ స్టేషన్ కు తరలించారు. ధాన్యం దారి మళ్లిస్తున్నట్లు గుర్తిస్తే టోల్-ఫ్రీ నంబర్ 14432 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెట్ డైరెక్టర్ తెలిపారు.