కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద కారును పార్కింగ్ చేయడంతో కలకలం సృష్టించింది. కాచిగూడ నింబోలి అడ్డ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద రోడ్డుకు అడ్డంగా ఓ వ్యక్తి కారును పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటలకు కారు పార్క్ చేసి వెళ్లడంతో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరినీ అటువైపు రానివ్వలేదు. వెంటనే బాంబ్ స్కాడ్, డాగ్ స్క్వాడ్‌ను పలిపించి కారులో తనిఖీలు నిర్వహించారు. కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించిన తర్వాత కారును పక్కకి తప్పించారు. ఈస్ట్‌జోన్ డిసిపి బాలస్వామి అక్కడికి వచ్చి తనిఖీలను పర్యవేక్షించారు. కారు బాలాజీ అనే వ్యక్తి పేరుపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.