రాజ్‌కోట్: దక్షిణాఫ్రికాఎతో గురువారం తొలి అనధికార వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఇండియా టీమ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఒక దశలో 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా టీమ్‌ను డియాన్ ఫొరెస్టర్ (77), డెలానొ పొట్గిటర్ (90) ఆదుకున్నారు. జోమ్ ఫౌర్టిన్ (59) తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాఎ జట్టు 49.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 129 బంతుల్లో 12 ఫోర్లతో 117 పరుగులుచేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ (31), కెప్టెన్ తిలక్ వర్మ (39), నితీశ్ కుమార్ రెడ్డి (37), నిశాంత్ సింధు 29 (నాటౌట్) తమవంతు పాత్రను పోషించారు.