యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను గురువారం సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సిినిమా ట్రైలర్ అదిరిపోయింది. హృదయానికి హత్తుకునేలా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో బిజిఎం అదిరిపోయింది. ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో లిటిల్ హార్ట్స్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్లుగా ట్రైలర్ ఉంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ’రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్ సాంగ్ అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
కాగా ,‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.