ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తుల కుతంత్రమేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు.ఈ దాడి దేశంలో శాంతిని భగ్నం చేసేందుకు, దేశ ప్రగతిని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యగా అభివర్ణించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదని అన్నారు. దేశం మొత్తం ఇలాంటి ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు కేంద్రానికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.