హైదరాబాద్: గంజాయి, డ్రగ్క్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, 2గ్రాముల ఎండిఎంఏ, రూ.5,500 నగదు, రెండు బైక్‌లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ సమీపంలోని బంజారాహిల్స్‌లోని కెబీఆర్ పార్క్ వద్ద గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగు తున్నాయనే సమాచారం వచ్చింది. వెంటనే హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న పి. వేమేష్, కె. దేవి చరణ్, వై. హేమంత్‌ను అరెస్టు చేశారు. ఈ దాడిలో సీఐతో పాటు కానిసేబుళ్లు కిరణ్, శ్రీకాంత్, సాయి కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కోసం గంజాయి, డ్రగ్స్‌తోపాటు ముగ్గురు నిందితులను అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
48 మద్యం బాటిళ్ల స్వాధీనం…
గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి తీసుకుని వస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ సీ అండ్ డీ టీమ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి హహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను తనిఖీలు చేయగా 48 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ పట్టుబడినట్లు ఎస్టీఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు తెలిపారు.