ఖుషి టాకీస్‌పై నిర్మించిన సీత ప్రయాణం కృష్ణతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటించారు. ఈ చిత్రాన్ని దేవేందర్ దర్శకత్వంలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో డా. రాజీవ్, డా.రోజా భారతి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో దినేష్ మాట్లాడుతూ కచ్చితంగా మా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. డైరెక్టర్ దేవేందర్ మాట్లాడుతూ “సీత ప్రయాణం కృష్ణ సినిమాని అన్నీ తానై మోసిన రోజా భారతికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్లు డా.రోజా భారతి, రాఖి శర్మ, డా.రాజీవ్ పాల్గొన్నారు.