ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ చేపట్టాయి. ఈ దాడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో సీటు పక్కన శరీర భాగాలు వైద్యుడు ఉమర్ నబీ డిఎస్‌ఎ మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేలుడు సంబంధించిన కారు నడుపుతున్న వ్యక్తి ఉమర్ గా గుర్తించిన విషయం విధితమే. కారులో ఉన్న ఉమర్ చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పుల్వామాలో అతడి తల్లి నుంచి డిఎన్‌ఎ నమూనాలు తీసుకొని పరీక్షించారు. కారులో శరీర భాగాల డిఎన్‌ఎ నమూనాలకు సరిపోవడంతో అతడు వాహనంలో ఉన్నట్టు నిర్థారణకు వచ్చారు. పేలుడు జరగక ముందు ఎర్రకోట సమీపంలోని ఫైజ్ ఎ ఇలాహి మసీదులోకి అతడు వెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసిటివిలో నమోదయ్యాయి. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగంగా నాలుగు నగరాల్లో దాడులకు చేయాలని ప్లాన్ చేశారు. ఒక్కో నగరంలో ఇద్దరు చొప్పున ఎనిమిది మంది నిందితులను సిద్ధం చేశాని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. మరో రెండు పాత కార్లను కూడా పేలుళ్లకు సిద్ధం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.