విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సినిమాలో జాక్ రెడ్డి అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్న డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “ఈ సినిమా సరదాగా సాగుతుంది. ఇంట్లో చేసిన మంచి తెలుగు భోజనం తిన్నప్పుడు ఎలాంటి తృప్తి ఉంటుందో, అలాంటి ఫీల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. నేను చేసిన జాక్ రెడ్డి క్యారెక్టర్ లాంటి వాళ్లు బయట కనిపిస్తుంటారు. పైకి టఫ్‌గా కనిపించినా గానీ వాళ్ల లోపల సాఫ్ట్‌నెస్ ఉంటుంది. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమాను రూపొందించాడు. చైతన్య క్యారెక్టర్‌లో విక్రాంత్ పర్పెక్ట్ గా కుదిరాడు”అని అన్నారు.