మన తెలంగాణ/హైదరాబాద్ : “నాకు మంత్రి పదవి కావాలని ఏనాడూ అడగలేదు& ఏ పదవి ఇచ్చినా బాధ్యతతో నిర్వహిస్తా”నని పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. తాను మంత్రి ప దవి అడిగినట్లు, డిప్యూటీ సిఎం కానున్నట్లు, ము ఖ్యమంత్రికి తనకు మధ్య గ్యాప్ ఉన్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆ యన బుధవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మా ట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ వి స్తరణ గురించి ప్రశ్నించగా, ఆ విషయాన్ని ము ఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ పా ర్టీ అభ్యర్థి నవీన్ కుమార్ ఘన విజయం సాధించనున్నారని ధీమాగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి నిదర్శనంగా ఫలితం రాబోతున్నదని ఆయన నమ్మకంగా అన్నారు. ఫలితానికి ముందే బిఆర్‌ఎస్, బిజెపి నేతలు డీలా పడ్డారని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లో మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలూ పార్టీ విజయానికి ఎంతో శ్రమించారని ఆయన చెప్పారు.
పోలింగ్ శాతం పెరగకపోవడం బాధాకరమని అన్నారు. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని ఆ యన కోరారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, ఇవిఎంలు వచ్చిన తర్వాత రిగ్గింగ్ చేయడం సా ధ్యం కాదని ఆయన చెప్పారు. పాత జమానాలో రిగ్గింగ్ జరిగేదని ఆయన వివరించారు. ఓడిపో తు న్నామనే బాధతో వారు ఆరోపణ చేశారని ఆ యన తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ త మ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకంగా అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధం గా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందున ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారన్న నమ్మకంతో చెబుతున్నానని ఆయన తెలిపారు. మరోసారి అధికారంలోకి రావాలని తాను పిసిసి అధ్యక్షునిగా కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. రెండో సారి గెలుపొంది ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ఉందన్నారు.
స్థానిక ఎన్నికలకూ సిద్ధం..
స్థానిక ఎన్నికలకూ తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్నికల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకుంటామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో త్వరలో చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని అన్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో బిజెపి అడ్డం పడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. బిసిలు బాగుపడరాదని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఓట్ చోరీపై త్వరలో కమిటీని నియమించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్‌లో మహా ఘట్‌బంధన్ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.