మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: మేడారం సమ్మ క్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20లోగా పూ ర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అ న్నా రు. బుధవారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారా నికి హెలికాప్టర్‌లో ఉదయం చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌ సింగ్, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఎస్.పి. శబరిష్ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన రాష్ట్ర అటవీ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మం త్రులు కొండ సురేఖ, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,
ఎంపి బలరాం నాయక్ లతో కలిసి వన దేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయం అభివృద్ధి పనులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న గద్దెల నిర్మాణం, దేవాలయ అభివృద్ధిపనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రులు మేడారం హరిత కాకతీయ హోటల్ లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదార్లతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కూలంకషంగా సమీక్షించి సమర్ధవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీ నివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులను పూర్తి చేస్తామని, గిరిజన పూజార్ల సూచన మేరకే పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని అన్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామని అన్నారు.
వచ్చే రెండు వందల సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, 25 రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, భవిష్యత్ లో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేడారం మాస్టర్ ప్లాన్ పై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఎంత డబ్బు ఖర్చు అయినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, అన్ని పనులను పూర్తి చేసి రానున్న మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, గతంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను నేటి ప్రజా ప్రభుత్వం చేస్తున్నదని వివరించారు.
చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్ర పండుగగా గుర్తించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ధేశించిన సమయంలో సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎస్ శ్రీనివాసరాజు,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హారీష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) సి హెచ్ మహేందర్ జి, (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బి, పి ఆర్ ఈ ఎన్ సి, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ప్రజా ప్రతినిధులు, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, గుత్తేదారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.