న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు శుభవార్త వెల్లడించింది. ఈఎంఐల భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసిఎల్‌ఆర్) తగ్గిస్తున్నట్లు బుధవారంనాడు ప్రకటించింది. వివిధ కాలపరిమితులపై వడ్డీ రేట్లో 5శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. కెనరాబ్యాంకు తాజా నిర్ణయంతో అందించే గృహ, వాహన, పర్సనల్ లోన్స్‌పై ఈఎంఐ భారం తగ్గనుంది. సవరించిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. ఓవర్‌నైట్ ఎంసిఎల్‌ఆర్‌ను 7.95 శాతం నుంచి 7.90కి తగ్గించింది. మూడు నెలల ఎంసిఎల్‌ఆర్‌ను 8.15శాతానికి, ఆరు మాసాల ఎంసిఎల్‌ఆర్‌ను 8.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటనలో వివరించింది.