న్యూఢిల్లీ : బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యక్షంగా “ప్రజాస్వామ్య ఖూనీ” సాగుతోందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఎక్స్ ఖాతాలో ఆయన అనేక ఆరోపణలు చేశారు. ఒక వ్యక్తి హర్యానా, ఢిల్లీ, బీహార్ ఎన్నికల పోలింగ్‌ల్లో ఓటు వేశాడని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేశారు. బీహార్ తుది దశ పోలింగ్ పూర్తయి, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఆయన ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాల్లో ఎన్‌డిఎ మెజారిటీ మార్కు 122 దాటి సులువుగా విజయం సాధిస్తుందని, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బుధవారం చాణక్య కూడా బీజేపీ దాని మిత్రపక్షాలు 160 సీట్లు, ఆర్‌జేడీ దాని మిత్ర పక్షాలు 77సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. అదే విధంగా మేట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఎన్‌డిఎ 147167. మహాఘఠ్‌బంధన్ 7090, జన్‌సురాజ్ 02 సీట్లు, సాధిస్తాయని వెల్లడించింది. దైనిక్ భాస్కర్ కూడా ఎన్‌డిఎ అదే స్థాయిలో 145160 సీట్లు, మహాఘఠ్ బంధన్ 7391 స్థానాలు సాధిస్తుందని వివరించింది.