గళూరు : ఢిల్లీ పేలుడును ప్రభుత్వం వైఫల్యంగా ఎఐసిసి చీఫ్ మల్లికార్జున అభివర్ణించారు. పేలుడు వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరమని, అయితే దేశ రాజధానిలోనే నిఘా వర్గాలు ఇంత ఘోర వైఫల్యం చెందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అన్ని దర్యాప్తు కేంద్రాలకు వేదికైన ఢిల్లీలోనే ప్రభుత్వం దారుణంగా విఫలం చెందిందన్నారు.
బుధవారంనాడు ఇక్కడ ఆయన మీడియాంతో మాట్లాడారు. పేలుడు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. దర్యాప్తును ఎన్‌ఐఎకు అప్పగించారని, ఆ సంస్థ వెల్లడించే నివేదికను పరిశీలించిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు.