బెళగావి : 15 జిల్లాలతో ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాజు కాగె రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారు. తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని, ప్రతి రంగంలో పాలకులు పక్షపాతం చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా సంతకాల సేకరణ కూడా చేపడతానని ఆయన ప్రకటించారు. బీదర్, కలబురగి, విజయపుర, యాద్గిర్, బాగల్‌కోట్, బెళగావి, ధార్వాడ్, గడగ్ తదితర జిల్లాలతో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.