బెంగళూరు: దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా సిఎం సిద్ధరామయ్య ఎన్నికల సమయం లోనే ఉగ్రమూకల దాడులు జరగడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. ఈ ప్రకటన మీడియాలో కూడా ప్రసారమైంది. మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌పూర్తయిన తరువాత సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి. మైసూరులో మంగళవారం విలేకరులతో సిద్ధరామయ్య మాట్లాడుతూ దేశంలో బాంబు పేలుళ్లు జరగకూడదని, అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు మంత్రి ప్రియాంక్ ఖర్గే అసమర్ధుడైన హోం మంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కర్ణాటక విభాగం అధ్యక్షుడు బివై విజయేంద్ర సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమే కాకుండా తక్కువస్థాయి రాజకీయాలని విమర్శించారు.