దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన స్పందనతో సినిమాపై మంచి అంచనాలను సృష్టించాయి. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్, రానా విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ “ఇది పూర్తిగా ఫిక్షనల్ కథ. ఆ కాలం నుంచి ప్రేరణ పొంది రాసిన కథ. ఇది ఒక సంఘటన అని చెప్పలేం. ఇద్దరు గొప్ప వ్యక్తులు గొడవలు పడిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు. -50ల బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడానికి కారణం ఉంది. ఆ కాలంలో సాహిత్యం, సంగీతానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది.
ఆ సమయంలో జరిగిన కథ అంటే తెలియని రొమాన్స్ వస్తుంది. భాగ్యశ్రీ ఈ కథకి సరిపోయింది. ఈ సినిమా మాకు చాలా స్పెషల్. మేము సినిమాని జీవితాంతం ప్రేమించే వాళ్ళం. సినిమానే మాకు అంత ఇచ్చింది. సినిమాకి మేము ఇవ్వాలి తిరిగి ఇవ్వాలి. అలాంటి అవకాశం ఈ సినిమాతో వచ్చింది”అని అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “-ఈ ఫిక్షనల్ స్టోరీ నాకు నచ్చింది. నేను ఇంకేది ఆలోచించలేదు. సినిమా చూసినప్పుడు దీన్ని ఒక మంచి కథగానే ఫీలవుతారు.- మహానటి సినిమాలో సినిమా ఉంటుంది. కానీ ఆ సినిమాకి ఒక రిఫరెన్స్ లేదు. ఇక ఈ క్యారెక్టర్ ఎలా చేస్తానని నేను, డైరెక్టర్ మాట్లాడుకునేవాళ్లం. ఒక మ్యాజిక్ అయితే జరిగింది. అది మీరు ట్రైలర్‌లో చూశారు. రానా, సముద్రఖని, భాగ్యశ్రీ అందరూ కూడా అద్భుతమైన నటులు. వీళ్ళ అందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ జరిగింది. – కాంత నా కెరీర్‌లో చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి సినిమాలు జీవితంలో ఒకేసారి వస్తాయి”అని తెలిపారు.