రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన ట్రాఫిక్‌తో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించే దిశలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నగరంలోని ఐటి కారిడార్‌లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తోంది. ఐటీ కారిడార్‌లలో మరిన్ని స్కైవాక్ లు, మోనోరైళ్లు నిర్మించాలని, మోనోరైళ్లకు అనుసంధానించేలా స్కైవాక్‌లు ఉండేలా చూస్తోంది. కాగా వీటికి కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ అనుమతి తప్పనిసరి అవసరం ఉంటుంది. దరిమిలా ఎ లా ముందుకు వెళ్లాలా అని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. స్కైవాక్‌లను దక్షిణ మధ్య రైల్వే నిధుల ద్వారా మోనో రైలును పిపిపి విధానంలో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఈ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మోనో రైళ్లతో త్వరలోనే ఐటి కారిడార్‌లకు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు.