ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నమోదయిన కేసులను సిఐడికి బదిలి చేయడంతో విచారణకు హజరు కావాలని సిఐడి సిట్ అధికారులు నోటిసులు ఇచ్చారు. బుధవారం విచారణకు హజరయిన ప్రకాశ్ రాజ్‌ను గంటపాట్నర పాటు సిట్ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పేనన్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం అధికారులకు ఇచ్చానని తెలిపారు. బెట్టింగ్ యాప్‌ను 2017లోనే బ్యాన్ చేశారని, 2016లో ఇంకా బెట్టింగ్ మొదలు కాలేదని, గేమ్ అనుకుని యాడ్ చేశానని చెప్పారు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్‌గా రూపాంతరం చెందిందని తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ యాడ్ నుంచి తప్పుకున్నానని ఆయన గుర్తుచేశారు.
ఆ సమయంలోనే కంపెనీతో తన ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు ఆయన వివరించారు. తాను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని సిట్ అధికారులకు చెప్పానన్నారు. బెట్టింగ్ యాప్స్ సరైనవి కావని, యువత వాటి జోలికి వెళ్లోద్దని సూచించారు. వీటి వల్ల చాలా మంది యవత ప్రాణాలు కొల్పోవడం బాధకరమయిన విషయమన్నారు. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టోద్దని కోరారు. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుందనే అప్పుడే డబ్బులు వస్తాయని, అందరం కష్టపడి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదయిన కేసును సిఐడి అడిషనల్ డిజిపి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో సినీనటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి.